PM Narendra Modi: కాన్పూర్ మెట్రోలో ప్రధాని మోడీ..
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ కాన్పూర్ పర్యటనలో భాగంగా మెట్రో రైలులో ప్రయాణించారు.
PM Narendra Modi: కాన్పూర్ మెట్రోలో ప్రధాని మోడీ..
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ కాన్పూర్ పర్యటనలో భాగంగా మెట్రో రైలులో ప్రయాణించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో కలిసి ఆయన ప్రయాణం సాగించారు. దీనికి ముందు, కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ సెక్షన్, బినా - పంకీ మల్టీ ప్రోడక్ట్ పైప్ లైన్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.
ఐఐటీ - కాన్పూర్ నుంచి మోతీజీల్ వరకూ సుమారు తొమ్మిది కిలోమీటర్ల పొడవైన రైల్ ప్రాజెక్టు ఇది. మొత్తం 32 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును 11వేల కోట్లతో పూర్తి చేస్తున్నట్టు పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. మోడీ ప్రధానంగా దృష్టి సారిస్తున్న అంశాల్లో అర్బన్ మొబిలిటీ ఒకటని, ఆ దిశగా కాన్పూర్ రైల్ ప్రాజెక్ట్ మరో ముందడుగని తెలిపింది.