PM Modi: యశోభూమిని ప్రారంభించిన ప్రధాని .. చిన్నారులను ప్రేమగా పలకరించిన మోడీ

PM Modi: మెట్రోలోని ప్రయాణికులతో మాట్లాడిన ప్రధాని మోడీ

Update: 2023-09-17 08:05 GMT

PM Modi: యశోభూమిని ప్రారంభించిన ప్రధాని .. చిన్నారులను ప్రేమగా పలకరించిన మోడీ

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ మొదటి దశను ప్రారంభించారు. దేశంలోని అన్ని కన్వెన్షన్ సెంటర్‌ల కంటే ఇది చాలా పెద్దది. ఢిల్లీలో 5వేల 4వందల కోట్ల భారీ బడ్జెట్‌‌‌తో నిర్మించిన తొలి దశ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ నిర్మాణం జరిగింది. దీనికే యశోభూమి అని నామకరణం చేశారు.

ఈ ప్రతిష్టాత్మక కన్వెన్షన్ సెంటర్‌ను 73వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రధాన ఆడిటోరియం సహా 15 కన్వెన్షన్ రూమ్‌లు ఇందులో ఉన్నాయి. ఒక గ్రాండ్ బాల్ రూమ్, 13 సమావేశ మందిరాలు కూడా ఉన్నాయి. వ్యర్థ జలాల శుద్ధికి సంబంధించి గొప్ప ఆధునిక విధానం ఉందని, వర్షపు నీరు పొదుపునకు చర్యలు తీసుకున్న ఈ కాంప్లెక్స్‌కు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినమ్ సర్టిఫికేషన్ వచ్చినట్టు ప్రధాని మోడీ చెప్పారు.

అంతకు ముందు ప్రధాని మోడీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రో లైన్ ఎక్స్ టెన్షన్‌ను ప్రారంభించారు. అనంతరం అదే మెట్రో రైలులో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ పొడిగించిన మార్గం కొత్తగా ఏర్పాటు చేసిన యశోభూమి ద్వారక సెక్టార్ 21 మెట్రో స్టేషన్‌ను అనుసంధానిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ అయిన యశోభూమిని ఈ మెట్రో లైన్ ద్వారా చేరుకోవచ్చు.

మెట్రోలో తోటి ప్రయాణికులతో పలు అంశాలపై మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చిన్నారులను ప్రేమగా పలకరించారు. ప్రధాని కొత్తగా ప్రారంభించిన మెట్రో లైన్ ప్రయాణికుల సేవలు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News