PM Modi: అంధుల మహిళల ప్రపంచకప్ విజేతలకు మోడీ ప్రశంస
PM Modi: అంధుల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు ప్రధాని మోడీని కలుసుకున్నారు.
PM Modi: అంధుల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు ప్రధాని మోడీని కలుసుకున్నారు. విజేతలైన భారత అంధుల మహిళా క్రికెట్ జట్టుకు కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు మోడీ. విజేత జట్టు సభ్యుల్ని ఆత్మీయంగా పలకరించారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ క్రికెటర్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. ఫైనల్స్ గెలవడంపై వాళ్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అందరికీ స్వీట్లు తినిపించారు. వారితో కూర్చొని సరదాగా ముచ్చటించారు మోడీ. అనంతరం మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన బ్యాట్‌ను మోడీకి బహమతిగా అందించారు.