Wayanad Landslides: ప్రధాని మోడీ ఏరియల్ సర్వే..
వయనాడ్ వరద బాధిత ప్రాంతాల్లో కేరళ సీఎం విజయన్ తో కలిసి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు ప్రధాని మోడీ.
Wayanad Landslides: ప్రధాని మోడీ ఏరియల్ సర్వే..
Wayanad Landslides: కేరళలోని వయనాడ్ లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. వయనాడ్ వరద బాధిత ప్రాంతాల్లో కేరళ సీఎం విజయన్ తో కలిసి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు. అనంతరం ఘటనాస్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను మోడీ పర్యవేక్షిస్తారు. ప్రధాన మంత్రి సహాయ శిబిరం, ఆస్పత్రిని సందర్శించి బాధిత కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు.
వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి పెను విషాదాన్ని నింపాయి. ఈ ఘోర విపత్తులో 400 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. గల్లంతైనవారి కోసం ఇంకా సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి.