PM Modi: కాంగ్రెస్, డీఎంకే పాలనలో కుంభకోణాలే కనిపిస్తాయి
PM Modi: మా పాలనలో అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తుంది
PM Modi: కాంగ్రెస్, డీఎంకే పాలనలో కుంభకోణాలే కనిపిస్తాయి
PM Modi: టార్గెట్ 400తో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ సౌత్ ఇండియాపై నజర్ పెంచింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రధాని మోడీ తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించారు. అక్కడి బహిరంగ సభలో అధికార పార్టీ డీఎంకే, ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్, డీఎంకే అవినీతి చరిత్ర కలిగిన పార్టీలని విమర్శిస్తూ.. ఎప్పటికీ ఈ రెండు పార్టీలు తమిళనాడు అభివృద్ధి కోసం పనిచేయలేవన్నారు. NDA పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు కనిపిస్తే... UPA పాలనలో కుంభకోణాలే కనిపిస్తాయని ఎద్దేవా చేశారు ప్రధాని మోడీ. దోచుకోవడమే కాంగ్రెస్, డీఎంకే పని అంటూ ఆరోపణలు చేశారు.