Narendra Modi: భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉంది
Narendra Modi: పోఖ్రాన్‌లో భారత్ శక్తి ప్రదర్శనను వీక్షించిన మోడీ
Narendra Modi: భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉంది
Narendra Modi: పోఖ్రాన్ భారతదేశ విశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని ప్రధాని మోడీ అన్నారు. స్వదేశీ పరిష్కారాలతో సమకాలీన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రధాని మోడీ రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారత్ శక్తి ప్రదర్శనను వీక్షించారు. జైసల్మేర్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో త్రివిధ దళాల స్వదేశీ ఆయుధాల శక్తి ప్రదర్శనను ఆయన చూశారు. ఆయుధాల మందుగుండు శక్తిని, త్రివిధ దళాల కార్యాచరణ సంసిద్ధతను ప్రదర్శించింది. 30కిపైగా దేశాల ప్రతినిధులతో ప్రధాని మోడీ ఈ లైవ్ ఫైర్‌ను ఆస్వాదించారు.