బిహార్ నుంచి నేపాల్ కు ప్యాసింజర్ రైల్..

PM Modi: భారత్-నేపాల్ మధ్య దౌత్య సంబంధాలు పటిష్టమయ్యే విధంగా అడుగులు పడ్డాయి.

Update: 2022-04-02 14:00 GMT

బిహార్ నుంచి నేపాల్ కు ప్యాసింజర్ రైల్..

PM Modi: భారత్-నేపాల్ మధ్య దౌత్య సంబంధాలు పటిష్టమయ్యే విధంగా అడుగులు పడ్డాయి. మూడు రోజుల పర్యటన కోసం ఇండియా వచ్చిన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, భారత ప్రధాని నరేంద్రమోడీ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రైల్వేలు, విద్యుత్తు వంటి కీలక అంశాలపై ఇచ్చిపుచ్చుకునేలా ఒప్పందాలు కుదిరాయి. నేపాల్ లోని కుర్తా నుంచి బిహార్ లోని జైనగర్ వరకు క్రాస్ బోర్డర్ ప్యాసింజర్ ట్రెయిన్ నడపాలని నిర్ణయించుకున్నారు.

అలాగే నేపాల్లో భారత పారిశ్రామికవేత్తల పెట్టుబడులతో నడుస్తున్న పవర్ ప్రాజెక్ట్స్ నుంచి ఇరువురూ లబ్ధిపొందేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నేపాల్ ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఇండియా పెద్దమొత్తంలో కొనుగోలు చేసేలా.. ఆ డీల్ ద్వారా నేపాల్ కు భారీఎత్తున లబ్ధి చేకూరనుంది. దీంతోపాటు భారత్ లో బాగా పాపులర్ అయిన రూపే కార్డు ఇకపై నేపాల్ లో చెల్లుబాటు అవుతుంది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో నిర్వహించిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేపాల్ కు భారత అంబాసిడర్ వినయ్... ఆ వివరాలు వెల్లడించారు. 

Tags:    

Similar News