PM Kisan: రైతులకు శుభవార్త..నేడే అకౌంట్లలోకి రూ. 2000!
PM Kisan: భారతదేశ రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత నిధులను నేడు, ఆగస్టు 2న విడుదల చేయనుంది.
PM Kisan: రైతులకు శుభవార్త..నేడే అకౌంట్లలోకి రూ. 2000!
PM Kisan: భారతదేశ రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత నిధులను నేడు, ఆగస్టు 2న విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా దేశంలోని కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందుతోంది. ఈసారి, ఏకంగా 9.7 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి రూ. 20,500 కోట్లు జమ కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేస్తారు. ప్రతి రైతు ఖాతాలోకి నేరుగా రూ. 2,000 జమ అవుతాయి.
ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశంలోని వివిధ గ్రామాల్లో, మండలాల్లో రైతులు ఈ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు, వినేందుకు ఏర్పాట్లు చేశారు. పీఎం కిసాన్ పథకం రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చిందో, భవిష్యత్తులో ఈ పథకం ద్వారా ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఆయన వివరించే అవకాశం ఉంది.
2019లో ప్రారంభమైన ఈ పీఎం కిసాన్ పథకం రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఒక పెద్ద అడుగు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తం ఒకేసారి కాకుండా, మూడు విడతలుగా రైతు ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటివరకు 19 విడతలుగా రూ. 3.69 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి బదిలీ అయ్యాయి.
పీఎం కిసాన్ పథకానికి లక్షల మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే, అందరికీ డబ్బులు రాకపోవచ్చు. ముఖ్యంగా, ఇ-కేవైసీ పూర్తి చేయని వారికి ఈసారి డబ్బులు అందకపోవచ్చు. ఒకవేళ మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉండి కూడా మీ అకౌంట్‌లోకి డబ్బులు రాకపోతే, దానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. ఇ-కేవైసీ పూర్తి చేయకపోవడం, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేయకపోవడం, లేదా అకౌంట్ వివరాల్లో తప్పులు ఉండటం వంటి కారణాలు దీనికి దారితీయవచ్చు. ఇలాంటి సమస్యలు ఉంటే, మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.