PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. 20వ విడత తేదీ ఖరారు.. ఆ రోజే అకౌంట్లోకి రూ.2000
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురుచూస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు గుడ్ న్యూస్. ఈ పథకం 20వ విడత డబ్బులు విడుదల చేసే తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. 20వ విడత తేదీ ఖరారు.. ఆ రోజే అకౌంట్లోకి రూ.2000
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురుచూస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు గుడ్ న్యూస్. ఈ పథకం 20వ విడత డబ్బులు విడుదల చేసే తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, 2025 ఆగస్టు 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ విడత డబ్బులను విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు రూ.2,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు బదిలీ అవుతాయి. ఈ వర్చువల్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పాల్గొంటారు. ఈసారి సుమారు 9.3 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ అంచనా వేస్తుంది. డబ్బులు విడుదలైన వెంటనే లబ్ధిదారులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019లో ప్రారంభమైంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 మూడు విడతలలో అందిస్తారు. ఇప్పటివరకు ప్రభుత్వం రైతులకు 19 విడతలు డబ్బులు అందించింది. ఆగస్టు 2న 20వ విడత విడుదల కానుంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ డబ్బులు లబ్ధిదారులకు అందుతాయి. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే, రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) మరియు భూ రికార్డుల ధృవీకరణను పూర్తి చేసి ఉండాలి. ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాతో లింక్ చేయనివారు లేదా రికార్డులు అసంపూర్తిగా ఉన్నవారికి ఈసారి కూడా డబ్బులు అందవు. అర్హులైన రైతులు తమ వివరాలను వీలైనంత త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తోంది.
మీకు డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి ఈ ఈజీ స్టెప్స్ ఫాలో అవ్వండి.
* అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోకి వెళ్లండి.
* Beneficiary Status ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయండి.
* Get Data బటన్‌ను నొక్కండి.
* స్క్రీన్‌పై మీ విడత స్టేటస్, చెల్లింపు సమాచారం కనిపిస్తుంది.
పీఎం కిసాన్ పథకం రైతుల ఆర్థిక భద్రతను పెంచడం, వ్యవసాయ సంబంధిత ఖర్చులలో వారికి సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం గత కొన్ని సంవత్సరాలలో దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఊరటనిచ్చింది.