PFI ఇచ్చిన పిలుపుతో కేరళలో బంద్‌

*తిరువనంతపురంలో కార్లు, ఆటోలపై రాళ్లురువ్విన నిరసనకారులు

Update: 2022-09-23 05:16 GMT

PFI ఇచ్చిన పిలుపుతో కేరళలో బంద్‌

Kerala: NIA సోదాలకు వ్యతిరేకంగా PFI ఇచ్చిన పిలుపుతో కేరళలో బంద్ కొనసాగుతోంది. అలువా సమీపంలో KSRTCకి చెందిన బస్సును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అలప్పుజ, హర్తాల్ ప్రాంతాల్లో కార్లు, ఆటోలపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. కోజికోడ్, కన్నూర్‌లో PFI కార్యకర్తల రాళ్లదాడిలో 15 ఏళ్ల బాలిక, ఆటో రిక్షా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. నారాయణపారా వద్ద పంపిణీ కోసం వార్తాపత్రికలను తీసుకెళ్తున్న వాహనంపై పెట్రోల్ బాంబు విసిరినట్లు తెలుస్తోంది.

పాపులర్ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియాపై దర్యాప్తు సంస్థలు పంజా విసిరాయి. టెర్రర్ కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థ లీడర్లపై ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. 10 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని పీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ఆఫీసులు, రాష్ట్ర, జిల్లా స్థాయి లీడర్ల ఇండ్లలో రెయిడ్స్ చేసి.. 106 మంది లీడర్లు, కార్యకర్తలను అరెస్టు చేశాయి. టెర్రరిస్టు శిబిరాలను నిర్వహించడంలో, టెర్రర్​కార్యకలాపాల్లో చేరాలంటూ యువతను ప్రోత్సహించడంలో వీరు నిమగ్నమై ఉన్నారనే అనుమానంతో అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థల అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి వ్యతరేకంగా ఇవాళ కేరళ బంద్‌కు పిలుపునిచ్చింది PFI సంస్థ.

Tags:    

Similar News