kangana ranaut: నన్ను కలిసేందుకు వచ్చే ప్రజలు ఆధార్ కార్డు తెచ్చుకోవాలి
kangana ranaut: మనాలిలోని నా ఇంటికి సైతం ప్రజలు రావొచ్చు
Kangana Ranaut: చిక్కుల్లో కంగనా రౌనత్..ఎన్నికపై హైకోర్టులో పిటిషన్
kangana ranaut: తనను కలిసేందుకు వచ్చే వారు ఆధార్ తెచ్చుకోవాలన్న కంగనా రనౌత్ వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తనను కలిసేందుకు వచ్చే నియోజకవర్గ ప్రజలు తమ వెంట ఆధార్ కార్డు తీసుకురావాలని కంగనా రనౌత్ కోరారు. ప్రజలను తనను కలిసేందుకు మనాలిలోని తన ఇంటికి సైతం రావొచ్చని చెప్పారు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతం కావున... ఆధార్ తీసుకువస్తే అసౌకర్యం ఉండదని ఆమె సూచించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఆధార్ కార్డు ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్. ప్రజా ప్రతినిధులను కలిసేందుకు రాష్ట్రంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజలు వస్తారని... వారు తమ వెంట గుర్తింపు కార్డు తెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు విక్రమాదిత్య.