Renuka Swamy Case: హీరో దర్శన్ కేసులో హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు
Renuka Swamy Case: రేణుకా స్వామి హత్య కేసులో నిందితులైన కన్నడ స్టార్ హీరో దర్శన్, పవిత్రా గౌడతో సహా ఏడుగురు నిందితులకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Renuka Swamy Case: హీరో దర్శన్ కేసులో హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు
Renuka Swamy Case: రేణుకా స్వామి హత్య కేసులో నిందితులైన కన్నడ స్టార్ హీరో దర్శన్, పవిత్రా గౌడతో సహా ఏడుగురు నిందితులకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా, ఈ కేసు మొత్తం జరగడానికి మీరే కారణం కదా? అని పవిత్రా గౌడను నేరుగా ప్రశ్నించింది. అలాగే కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
పవిత్రా గౌడ తరఫున వాదించిన లాయర్ "పవిత్రా గౌడ వల్ల రేణుకా స్వామికి ఒక్క గాయం కూడా కాలేదు. చెప్పుతో కొట్టారనే ఒకే ఒక్క స్టేట్‌మెంట్ మాత్రమే ఉందని వాదించారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె.బి. పర్దివాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు లేకపోతే ఏ2 దర్శన్ ఈ కేసులో ఉండే వాడు కాదు. ఇదంతా జరగడానికి మీరే కారణం కదా?" అని నేరుగా పవిత్రా గౌడను ప్రశ్నించారు.
మేము నిందితుడికి శిక్ష విధించం, నిర్దోషిగా ప్రకటించం. హైకోర్టు చేసిన తప్పును మేము చేయమని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. దర్శన్, ఇతరులకు బెయిల్ మంజూరు చేసేటప్పుడు హైకోర్టు తన విచక్షణను ఉపయోగించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. "హైకోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించినట్లు ఆదేశం ఇచ్చింది కదా? హైకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు మాకు బాధ కలిగించింది. ట్రయల్ కోర్టు జడ్జి తప్పు చేస్తే నమ్మవచ్చు. కానీ, హైకోర్టు జడ్జిల నుంచి అలాంటిది జరగకూడదు" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
పవిత్రా గౌడ రేణుకా స్వామి హత్య కేసులో ఏ1 నిందితురాలుగా ఉన్నారు. ఈ మొత్తం ఘటన పరోక్షంగా ఆమె వల్లే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. పవిత్రా గౌడ కోరిక మేరకే దర్శన్ ఈ హత్యను చేయించాడని ఆరోపణ ఉంది. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ కేసు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది.