Nirbhaya Case: నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు.. ఉదయం 6 గంటలకు..

Update: 2020-02-17 10:50 GMT

నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలనీ పాటియాలా కోర్టు తీర్పు చెప్పింది. నలుగురు దోషులను ఉదయం 6 గంటలకు ఉరితీయాలని కోర్టు తీర్పు చెప్పింది. నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో నిందితులను నలుగురు మార్చి 3 న ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాలని.. ఈ మేరకు పాటియాలా హౌకోర్టు సోమవారం కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిందనే ఆశలో నిర్భయ కుటుంబం ఉంది. కాగా ఈ రోజు విచారణ ప్రారంభమైన వెంటనే, తిహార్ జైలు స్టేటస్ రిపోర్టును కోర్టుకు అందజేశారు. కేసు యొక్క ప్రస్తుత స్థితి గురించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ కోర్టుకు వివరించారు మరియు నలుగురిలో ముగ్గురికి తమ చట్టపరమైన అవకాశాలను ఇప్పటికే రద్దు చేశారని చెప్పారు.ఢిల్లీ హైకోర్టు దోషులకు ఏడు రోజుల సమయం ఇచ్చిందని, ఆ కాలం ముగిసిందని ఆయన అన్నారు. అలాగే, ఏ కోర్టులోనూ పిటిషన్ పెండింగ్‌లో లేదని.. దోషులపై కొత్త డెత్ వారెంట్ జారీ చేయమని నిర్భయ కుటుంబం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు.

కేసుపై వాదనలు ఇలా..

ఇక అక్షయ్ న్యాయవాది మాట్లాడుతూ.. రాష్ట్రపతి ముందు కొత్త క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. అలాగేమరో దోషి వినయ్ న్యాయవాది మాట్లాడుతూ వినయ్ కోర్టులో దాడి చేశాడని, తలకు గాయాలయ్యాయని చెప్పారు. ఫిబ్రవరి 11 నుండి వినయ్ నిరాహార దీక్ష చేస్తున్నట్లు దోషి వినయ్ న్యాయవాది ఎపి సింగ్ కోర్టుకు తెలిపారు. అతను జైలులో అన్నం తినడం లేదు.. ఈ సమయంలో, వినయ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోర్టు.. జైలు పరిపాలనకు ఆదేశాలు జారీ చేసింది. నలుగురు దోషులలో ఒకరైన ముఖేష్ న్యాయవాది బృందా గ్రోవర్ సహాయం కోరుకోవడం లేదని.. తాను ఇకపై ముఖేష్ న్యాయవాది కాదని కోర్టుకు తెలిపారు. అనంతరం కోర్టు.. దోషిగా తేలిన ముఖేష్ తరపు న్యాయవాదిగా రవి కాజీని నియమించింది. 


Full View


Tags:    

Similar News