Parliament's Monsoon Session : త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కేంద్రం కసరత్తు!

Parliament's Monsoon Session : భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా వైరస్ కేసులతో కలిపి దేశవ్యాప్తంగా రోజురోజుకు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Update: 2020-07-02 07:25 GMT

Parliament's Monsoon Session : భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా వైరస్ కేసులతో కలిపి దేశవ్యాప్తంగా రోజురోజుకు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాల్ని, సభలు, సమవేశాల్ని వాయిదా వేశాయి. కరోనా ఎఫెక్ట్ కారణంగా అటు కేంద్రం పార్లమెంట్ సమావేశాల్ని, ఇటు పలు రాష్ట్రాలు అసెంబ్లీ సమావేశాల్ని అనుకున్న మేరకు నిర్వహించలేకపోయాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలను మార్చి 23వ తేదీనే ముగించారు. షెడ్యూల్‌ ప్రకారం అయితే ఏప్రిల్‌ 3వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉంది. ఇక ఒకవేళ మంత్రివర్గ సమావేశాలు నిర్వహించవలసిన అవసరం ఏర్పడినప్పుడు సామాజిక దూరం కచ్చితంగా పాటిస్తూ వస్తున్నారు..

ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో ఈ సమావేశాలను నిర్వహించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. అయితే వాటిని ఎలా నిర్వహించాలి అన్నదానిపై కసరత్తు సాగుతుంది. ఈసారి లోక్‌సభ సమావేశాలను పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో..రాజ్యసభ సమావేశాలను లోక్‌సభ ఛాంబర్‌లో నిర్వహించాలన్న ప్రతిపాదనను కూడా కేంద్రం పరిశీలిస్తున్నది. అయితే రెండు సమావేశాల మధ్య ఆరు నెలల గ్యాప్ ఉండకూడదు అన్న నిబంధన ఉండడంతో సెప్టెంబర్ చివరి వారంలో వర్షాకాలపు సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కరానా విస్తరిస్తున్న వేళ కేంద్రం సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగుతాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇక భారత్ లో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి.. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,148 కేసులు నమోదు కాగా, 434 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 6,04,641 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,26,947 ఉండగా, 3,59,859 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 17,834 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,29,588 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 90,56,173 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.


Tags:    

Similar News