parliament session 2020: పార్లమెంటు సమావేశాల కుదింపు దిశగా కేంద్రం యోచ‌న‌

parliament session 2020: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Update: 2020-09-19 08:49 GMT

parliament session 2020:

parliament session 2020: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా బారిన పడుతున్న ఎంపీల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇప్పటికే దాదాపు 30 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత సమావేశాలు ఈ నెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ప్రాంగణం వద్ద అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం పునరాలోచనలో పడింది. సమావేశాల రోజులను కుదించే యోచనలో కేంద్రం ఉందని పార్లమెంట్ అధికారులు చెపుతున్నారు. కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుని  సమావేశాలను ప్రారంభించినా... కేసులు పెరగడంతో  పునరాలోచనలో పడింది.

Tags:    

Similar News