రేపటినుంచి పార్లమెంట్ సమావేశాలు... అది తప్పనిసరి!

Parliament Monsoon Session : రేపటినుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. సభలకి హాజరు అయ్యేవారు ప్రతి ఒక్కరు

Update: 2020-09-13 07:09 GMT

Parliament Monsoon Session 

Parliament Monsoon Session : రేపటినుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. సభలకి హాజరు అయ్యేవారు ప్రతి ఒక్కరు కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని, అందులో నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుల్లో అధిక వయస్సువారే ఎక్కువగా ఉండడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. 72 గంట‌ల ముందుగానే క‌రోనా ప‌రీక్షలు చేయించుకోవాల‌ని స‌భ్యుల‌కు సూచించారు. స‌భ్యుల‌తోపాటు వ్యక్తిగ‌త సిబ్బంది, ఇంటిలో ప‌నివారికి కూడా క‌రోనా ప‌రీక్లు చేయించాల‌ని స్పష్టంచేశారు.

ఇక కరోనా విజృంభణ తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కానుండటంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో సందర్శకులకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సిబ్బంది, అంబులెన్స్‌, అన్ని రకాల వ్యవస్థలను అధికారులు సిద్ధం చేశారు.ఇక పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారి పలు ప్రదేశాల నుంచి రియల్‌ టైమ్‌లో ఉభయసభలు సమావేశం కానున్నాయి. సమావేశాల తొలిరోజు ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ, 15 నుంచి ఉదయం 11 గంటలకు రాజ్యసభ, మధ్యాహ్నం 2గంటల నుంచి లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల నిర్వహణపై పలుమార్లు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

ఇక పార్లమెంటులో ఎలా వ్యవ‌హ‌రించాల‌నే విష‌యంపై నేడు అధికారులు ఉభ‌య స‌భ‌ల బీఏసీ స‌మావేశాలు ఏర్పాటుచేశారు. ఉద‌యం 11 గంట‌ల‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ నేతృత్వంలో బీఏసీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నేతృత్వంలో, సాయంత్రం నాలుగు గంటలకు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు నేతృత్వంలో రాజ్యసభ బీఏసీ సమావేశం జరగనుంది.

Tags:    

Similar News