Pakistan Plane: భారత గగనతలంలోకి పాకిస్థాన్ విమానం
Pakistan Plane: భారీ వర్షం కారణంగా పైలట్ దారితప్పడంతో.. భారత్‌లోకి ప్రవేశించిన విమానం
Pakistan Plane: భారత గగనతలంలోకి పాకిస్థాన్ విమానం
Pakistan Plane: పాకిస్తాన్‌కు చెందిన విమానం భారత గగనతలంలో విహరించింది. దాదాపు 10 నిమిషాల పాటు 120కి.మీ మేర భారత గగనతలంలో ప్రయాణించింది. భారీ వర్షం కారణంగా లాహోర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడం కుదరకపోవడం, పైలట్ దారితప్పడంతో ఆ విమానం భారత్‌లోకి ప్రవేశించింది.
పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ కు చెందిన పీకే-248 విమానం మే 4 రాత్రి 8 గంటల సమయంలో మస్కట్ నుంచి పాకిస్థాన్‌కు బయలుదేరింది. లాహోర్ లోని అలామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ భారీ వర్షం కారణంగా అక్కడ దిగేందుకు వీలు కాలేదు.
దీంతో చేసేదేం లేక పైలట్ విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో పైలట్ ఆ భారీ వర్షంలో దారి మర్చిపోయాడు. దాదాపు 13 వేల 5 వందల అడుగుల ఎత్తులో ఎగురుతూ 292 కి.మీ వేగంతో ఆ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. ఇలా 7 నిమిషాలు భారత్‌లో ప్రయాణించిన తర్వాత పాక్‌లోకి వెళ్లింది. అయితే కాసేపటికే ఆ విమానం మళ్లీ భారత్‌లోకి ప్రవేశించింది. మళ్లీ ౩ నిమిషాల తర్వాత 23వేల అడగుల ఎత్తులో ప్రయాణిస్తూ 320కి.మీ వేగంతో పాక్ లోకి వెళ్లిపోయింది.