Operation Sindoor: మాకు న్యాయం జరిగింది.. పహల్గామ్ బాధిత కుటుంబ సభ్యుల సంతోషం

Update: 2025-05-07 04:02 GMT

Operation Sindoor: మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేపట్టింది. గత నెల 22 న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు ప్రారంభించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇదే సమయంలో పహల్గామ్ బాధిత కుటుంబ సభ్యులకు కూడా దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ దాడులతో తమకు న్యాయం జరిగిందన్నారు. భారత ఆర్మీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. జమ్మూకశ్మీర్ లోని స్థానికులు భారత ఆర్మీకి జిందాబాద్ లు కొడుతూ..భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

మేము ఇంత బాధలోనూ ఆనంద పడుతున్నాము. ప్రధాని మోదీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారనేదానికి ఈ ఆపరేషన్ కు ఆయన పెట్టిన పేరే నిదర్శనం. మా కన్నీళ్లు ఆగడం లేదు. ఉగ్రవాదుల వల్ల సోదరీమణులు తమ సింధూరం కోల్పోయినందుకు వారికి గుర్తుగా ఈ దాడులకు నామకరణం చేశారు. తొమ్మిది స్థానాల్లో వారిపై భారత ఆర్మీ ఎదురు దాడులకు పాల్పడింది. ఇది నిజంగా అనుభూతి కలిగించే అంశమని సంతోష్ జగ్ దలే కుమార్తె అశ్విరి అన్నారు.

నేను ఉదయం నుంచి వార్తలు చూస్తూనే ఉన్నాను. ఈ సందర్భంగా భారత ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నాను. ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నాము. దేశ ప్రజల బాధను విని పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేసినందుకు ధన్యవాదములు. ఉగ్రవాదులపై దాడి చేస్తున్నట్లు వస్తున్న వార్తలను విన్నప్పటి నుంచి మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉందని శుభమ్ ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది అన్నారు. 

Tags:    

Similar News