Pahalgam Attack video: పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు.. లైవ్ వీడియో రికార్డు చేసిన టూరిస్ట్

Pahalgam Attack video: పహల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు.. లైవ్ వీడియో రికార్డు చేసిన టూరిస్ట్

Update: 2025-04-28 16:45 GMT

పహల్గం ఉగ్రదాడికి సంబంధించి రోజుకొక కొత్త విషయం వెలుగులోకొస్తోంది. ఎప్పటికప్పుడు ఏవో ఒక ఫొటోలు, వీడియోలు బయటికొస్తూనే ఉన్నాయి. ఒక టూరిస్ట్ తన సరదా కోసం తీసుకున్న వీడియోలో ఉగ్రవాదుల అరాచకం రికార్డు అయింది. ఆనాటి ఆ దృశ్యం తాజాగా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

కాల్పులు జరిగిన బైసరన్ వ్యాలీ ప్రదేశంలోనే ఒక టూరిస్ట్జిప్ లైన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఆ దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో రికార్డు చేసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఉగ్రవాదుల నుండి ప్రాణాలు దక్కించుకునేందుకు పర్యాటకులు పరుగులు తీస్తున్నారు. టెర్రరిస్టుల బుల్లెట్స్ మోత, పర్యాటకులు పరుగులు తీయడం కూడా అందులో రికార్డు అయింది.

గాల్లో వేగంగా రయ్యుమని దూసుకుపోతున్న సదరు టూరిస్ట్ మాత్రం తన సరదాలో తను ఉండి ఆ కాల్పులను పట్టించుకోవడం లేదు. బహుశా ఆ సమయంలో ఆ కాల్పుల శబ్దం అతడికి వినిపించకపోయి ఉండవచ్చు.

ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెడుతూనే బుల్లెట్ తగిలి వెనక్కి పడిపోవడం ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది.  

Tags:    

Similar News