Greta Thunberg: ఇండియాకు ప్రపంచ దేశాలు సహాయం చేయాలి- గ్రేటా థన్‌బర్గ్‌

Greta Thunberg: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య వాల్డ్‌ రికార్డ్‌కు చేరింది. అంతేకాదు దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర రూపం దాల్చుతోంది.

Update: 2021-04-26 06:06 GMT

గ్రేటా థన్‌బర్గ్‌ (ఫైల్ ఇమేజ్ )

Greta Thunberg: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య వాల్డ్‌ రికార్డ్‌కు చేరింది. అంతేకాదు దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర రూపం దాల్చుతోంది. మరోవైపు ఆక్సిజన్‌, బెడ్ల కొరత కారణంగా రోగులు నానా అవస్థలు పడుతున్నారు. చెప్పాలంటే చికిత్సకు ముందే ప్రాణవాయువు దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై ప్రపంచ పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌ స్పందించారు. ఇండియా పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఈ విపత్కర సమయంలో భారత్‌కు ప్రపంచ దేశాలు సహాయం చేయాలని కోరారు.

కరోనా విజృంభణతో ఇబ్బందిపడుతోన్న భారత్‌కు తాము అన్నివిధాలా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మక్రాన్‌. ఈ కష్టకాలంలో ఫ్రాన్స్‌ ఇండియాకు తోడుగా ఉంటుందన్నారు.

ఇక భారత్‌లో వైద్యానికి అవసరమయ్యే ముడిసరకు ఎగుమతి అంశంపై అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు దిగొచ్చింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావానికి అల్లాడిపోతున్న ఇండియాకు వైద్య పరంగా అవసరమైన అదనపు సాయాన్ని అందించనున్నట్లు అమెరికా విదేశాంగా మంత్రి ఆంటోని బ్లింకన్‌ వెల్లడించారు.

Tags:    

Similar News