Independence Day : భారత్‌తో పాటుగా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే దేశాలు ఇవే!

Independence Day : వందల ఏళ్ళ బానిసత్వం నుంచి విడుదలై 1947 ఆగస్టు 15 వ తేదిన స్వాతంత్ర్యం పొందింది భారతదేశం... ఈ సందర్భంగా

Update: 2020-08-15 11:47 GMT
Independance Day poster

Independence Day  : వందల ఏళ్ళ బానిసత్వం నుంచి విడుదలై 1947 ఆగస్టు 15 వ తేదిన స్వాతంత్ర్యం పొందింది భారతదేశం... ఈ సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 15న భారతీయులమంతా గర్వంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు.. దేశ ప్రజలకి ఈ స్వాతంత్ర్యం అందించడంలో ఎంత మంది అమరవీరుల పాత్ర ఉంది.. వారు చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యం అని చెప్పాలి.. ఇక మనలాగే మరికొన్ని దేశాలు కూడా ఇదే రోజున స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.. ఇంతకి ఆ దేశాలు ఏంటి ? ఒక్కసారి చూద్దాం...

కొరియా :

ఈ దేశం 1945 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం పొందింది.. 1910 నుంచి ఉమ్మడి కొరియాపై జపాన్‌ అధికారం చలాయించింది. ఇక రెండో ప్రపంచ యుద్ధంలో యూఎస్‌, సోవియేట్‌ ఆర్మీలతో కలిసి జపాన్‌పై కొరియా పోరాడింది.. దీంతో 1945 ఆగస్టు 15న మిత్ర రాజ్యాలకు లొంగిపోతున్నట్లు అప్పటి జపాన్‌ చక్రవర్తి హిరోహిటో వెల్లడించారు. ఇక ఇలా జరిగిన మూడు సంవత్సరాల తర్వాత కొరియా రెండు దేశాలుగా విడిపోయింది. అందులో ఒకటి ఉత్తరకొరియా కాగా, మరొకటి దక్షణ కొరియా.. కానీ ఈ రెండు ఆగస్టు 15 నే జాతీయ విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంటాయి..

బహ్రెయిన్‌ :

భారత్ లాగే ఈ దేశం కూడా తెల్లదొరల‌ పరిపాలనలోనే ఉండిపోయింది. ఇక 1971 ఆగస్టు 15న ఐక్యరాజ్యసమితి బహ్రెయిన్‌ దేశాన్ని స్వతంత్ర దేశంగా ఉండటంపై రెఫరెండం నిర్వహించింది. ఫలితంగా బహ్రెయిన్‌ అధికారికంగా స్వతంత్ర దేశంగా ఏర్పడింది.

రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో :

1960 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సంపాదించుకుంది ఈ దేశం.. ఫ్రాన్స్‌ సైన్యంపై తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యం పొందింది. ఇది అపారమైన ఆర్థిక వనరులతో కూడిన విస్తారమైన దేశం. 1891 లో ఫ్రెంచ్ వారు కాంగోపై తమ వలస పాలనను స్థాపించారు. ఇక ఆ తర్వాత వారిపైన ఫ్రాన్స్‌ సైన్యంపై తిరుగుబాటు చేసి ఆగష్టు 15, 1960 న పూర్తి స్వాతంత్ర్యం పొందింది.

Tags:    

Similar News