Operation Sindoor: అప్పుడు బాలాకోట్..ఇప్పుడు ఆపరేషన్ సింధూర్..పాక్‎ను చావుదెబ్బకొట్టిన భారత్

Update: 2025-05-07 06:19 GMT

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలను ప్రారంభించింది. ఆపరేషర్ సింధూర్ పేరుతో ఉగ్రస్ధావరాలపై మెరుపుదాడులు చేపట్టింది. ఈ చర్యపై యావత్ భారత్ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తోంది. దాయాదిని ఏమార్చి..అత్యంత పకడ్బందీగా దాడుల ప్రణాళికలను భారత్ అమలు చేస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి. బాలకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలతోనే ప్రధాని అమలు చేసిన సంగతి తెలిసిందే. దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదిని మరోసారి ఏమర్చి దాడి చేశారు. భారత్ దాడులతో పాకిస్తాన్ షాక్ గురకావడం తప్పలేదు.

బాలాకోట్ దాడి..ఆపరేషన్ సింధూర్ ల మధ్య ఎన్నో పోలికలను మనం చూడవచ్చు. అయితే వీటిని దాయాది పాకిస్తాన్ పసిగట్టడంలో విఫలం అయ్యింది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో చాలా వెనబడింది. పాక్ ద్రుష్టిని మరల్చి దెబ్బకొట్టడంలో భారత ప్రధాని మోదీ మరోసారి పై చేయి సాధించారు. దీంతో దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ పై భారత్ దాడులకు పాల్పడింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోదీ ఎప్పటివలే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 25న ఆయన ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి మాట్లాడినప్పటికీ పాక్ లోని ఖైబర్ ఫంఖ్తుంఖ్వాలోని ఉగ్రస్ధావారలపై జరగబోయే దాడుల గురించి మాత్రం ఎలాంటి సూచనలు చేయలేదు. ఆ రోజు రాత్రి 9గంటలకు భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా..ప్రధాని మోడీ ఢిల్లీలోని ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అభివ్రుద్ధి, భారత ఆకాంక్షలు ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో భారత సంకల్పం గురించి ఆయన మాట్లాడారు. అయితే ఆ సమయంలో ప్రధాని ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. ప్రశాంతంగా ఉన్నారు. ఆ తర్వాత భారత బలగాలు తాము చేయాల్సిన పనిని పూర్తి చేశాయి.

బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రవర్తన అప్పుడు ఎలా ఉందో..ఇప్పుడూ అలాగే ఉంది. ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అప్పుడు పాల్గొన్న విధంగానే ఇప్పుడు కూడా ఒక రోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఏబీపీ నెట్ వర్క్ నిర్వహించిన ఇండియా ఎట్ 2047 సదస్సులో మోదీ మాట్లాడారు. భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని తేల్చి చెప్పారు. దాదాపు అరగంట సేపు ప్రధాని ప్రసంగించారు. అప్పుడు బాలకోట్ దాడులు..ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాక్ పూర్తిగా విఫలమైంది. దాయాది ద్రుష్టిని మరల్చి దాడి చేయడంలో భారత్ మరోసారి పైచేయి సాధించింది.


Tags:    

Similar News