ఆపరేషన్‌ సిందూర్‌లో హతమైన టాప్‌ టెర్రరిస్ట్‌లు వీళ్లే.. వివరాలు వెల్లడి..!

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది.

Update: 2025-05-10 10:02 GMT

ఆపరేషన్‌ సిందూర్‌లో హతమైన టాప్‌ టెర్రరిస్ట్‌లు వీళ్లే.. వివరాలు వెల్లడి..!

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఇండియన్ ఆర్మీ ఈనెల 7న జరిపిన దాడుల్లో ఐదుగురు ఉగ్రసంస్థల అగ్రనేతలు హతమైనట్టు ప్రకటించింది. మృతుల్లో లష్కరే తోయిబాకు చెందిన అగ్రనేతలు మదస్సర్ ఖదాయిన్ ఖాస్, ఖలీద్ హతమయ్యారు. వీరితో పాటు జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్ అజర్‌ బంధువులు అయిన హఫీజ్‌ మహమ్మద్ జమీల్, మహ్మద్ యూసఫ్‌ అజార్‌ మరణించారు.

ఇదే సంస్థకు చెందిన మరో టెర్రరిస్ట్‌ మహ్మద్ హసన్ ఖాన్‌ కూడా హతమైనట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఇందులో లష్కరే తోయిబా కీలక నేత మదస్సర్ ఖదాయిన్ ఖాస్‌ అంత్యక్రియలను పాక్‌ ఆర్మీ అధికారిక లాంఛనాలతో నిర్వహించగా.. ఈ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్‌ హాజరయ్యారు.

Tags:    

Similar News