కొనసాగుతున్న హిజాబ్ వివాదం

Karnataka: కర్ణాటక హైకోర్టులో నేడు హిజాబ్ వివాదంపై విచారణ.

Update: 2022-02-15 04:27 GMT

కొనసాగుతున్న హిజాబ్ వివాదం

Karnataka: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడీ వివాదం పొలిటికల్ రచ్చకు కూడా దారి తీసింది. ఇక హిజాబ్ అంశంపై కర్ణాకట హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇక సోమవారం కూడా హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. అయితే ఈ వివాదంపై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇటు పిటీషనర్ తరుపున న్యాయవాది.. అటు ప్రభుత్వం తరుపున న్యాయవాది రెండు వర్గాల వాదలనను హైకోర్ట్ విన్నది. కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో హిజాబ్‌కు అనుమతి ఉందని పిటిషనర్ల తరుపు న్యాయవాది దేవధత్ కామత్ వాదించారు. హిజాబ్ పై నిషేధం ఆర్టికల్ 25కి వ్యతిరేఖం అని పిటిషన్ల తరుపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

మరోవైపు హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరా.. కాదా అని తేలాలని ప్రభుత్వం వాదనలను వినిపించింది. హిజాబ్ ధరించి ముస్లిం యువతులు స్కూళ్లకు రావడాన్ని అనుమతించాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. హిజాబ్ ధరించాలా వద్దా అనే నిర్ణయాన్ని కాలేజీ కమిటీలకు అప్పగించడం పూర్తిగా చట్టవిరుద్ధం అని దేవధత్ కామత్ కోర్టుకు విన్నవించారు.

ఇక హిజాబ్ వివాదం నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. గత వారం రోజులుగా ఉడిపి, దక్షిణ కన్నడ, బెంగళూరు జిల్లాల్లో హిజాబ్ అంశంపై ఘర్షణలు జరిగాయి. సోమవారం స్కూళ్లలో సాధారణ హాజరు శాతమే నమోదైందని విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. హైకోర్టు ఆదేశాల మేరకు యాజమాన్యాలు మతపరమైన వస్త్రాలు తొలగించాకే విద్యార్థులను తరగతుల్లోకి అనుమతించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అన్ని పాఠశాలలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు.

Tags:    

Similar News