Bucharest: రొమేనియాలో పేలుళ్లు.. ఒకరు మృతి.. 50 మందికి పైగా గాయాలు
Bucharest: బుకారెస్ట్ సమీపంలోని గ్యాస్ స్టేషన్‌లో బ్లాస్ట్
Bucharest: రొమేనియాలో పేలుళ్లు.. ఒకరు మృతి.. 50 మందికి పైగా గాయాలు
Bucharest: రొమేనియాలో పేలుళ్ల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బుకారెస్ట్ సమీపంలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకొని 20కి పైగా ఫైరింజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. అయితే.. పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. దీంతో.. ప్రజలు ప్రాణాలతో అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.