సునామీలా ఒమిక్రాన్ కేసులు.. కమ్యూనిటీ స్ప్రెడ్ మొదలైనట్టేనన్న ఢిల్లీ సర్కార్

Omicron Cases in Delhi: దేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

Update: 2021-12-30 16:00 GMT

సునామీలా ఒమిక్రాన్ కేసులు.. కమ్యూనిటీ స్ప్రెడ్ మొదలైనట్టేనన్న ఢిల్లీ సర్కార్

Omicron Cases in Delhi: దేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వాళ్లు, ప్రయాణాలు చేసిన వారే ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డారు. ఇప్పడు ఢిల్లీలో ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేనివాళ్లు ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇది సామాజిక వ్యాప్తిని సూచిస్తోందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే తాజా జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదిక ప్రకారం నమూనాల్లో 46 శాతం ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూసినట్లు మంత్రి వెల్లడించారు. డిసెంబర్ 20న 91 కేసులుండగా అకస్మాత్తుగా 900 దాటాయి. మే 30 తర్వాత ఇవే అత్యధిక కేసులు. ప్రస్తుతం 1.29 శాతంగా పాజిటివిటీ రేటు ఉంది. కేసుల ఉద్ధృతిని గమనించిన ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ను ప్రకటించి ఆంక్షలను కఠినతరం చేసింది.

Tags:    

Similar News