రేషన్‌ కార్డుదారులకి గమనిక.. డీలర్ తక్కువ రేషన్‌ ఇస్తే ఈ నెంబర్లకి ఫోన్‌ చేసి కంప్లయింట్ ఇవ్వొచ్చు..!

Ration Cardholders: రేషన్ కార్డ్ హోల్డర్లకు గమనిక. డీలర్లు మీకు తక్కువ రేషన్ ఇస్తున్నారని అనుమానం కలిగితే ఆందోళన చెందాల్సిన పనిలేదు.

Update: 2022-05-13 09:30 GMT

రేషన్‌ కార్డుదారులకి గమనిక.. డీలర్ తక్కువ రేషన్‌ ఇస్తే ఈ నెంబర్లకి ఫోన్‌ చేసి కంప్లయింట్ ఇవ్వొచ్చు..!

Ration Cardholders: రేషన్ కార్డ్ హోల్డర్లకు గమనిక. డీలర్లు మీకు తక్కువ రేషన్ ఇస్తున్నారని అనుమానం కలిగితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు ఒక్క ఫోన్‌కాల్‌ చేస్తే చాలు పూర్తి రేషన్‌ తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ కొంతమంది రేషన్ డీలర్లు అవకతవకలకి పాల్పడుతారు. మీకు కూడా ఇలా జరిగితే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఈ ఫోన్‌ నెంబర్లు రాష్ట్రాల ప్రకారం వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి మీ సొంత రాష్ట్రం నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోండి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే కాల్ చేసి ఫిర్యాదు చేయండి. ఇది కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిన అవినీతిని తగ్గించడానికి, ఆహార పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కరోనా కాలంలో ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ సౌకర్యాన్ని అందించింది. దీని కింద దేశంలోని కోట్లాది మంది ప్రజలు లబ్ధి పొందారు.

మీ రాష్ట్ర సంఖ్యను తనిఖీ చేయండి

ఆంధ్రప్రదేశ్ - 1800-425-2977

అరుణాచల్ ప్రదేశ్ - 03602244290

అస్సాం - 1800-345-3611

బీహార్ -1800-3456-194

ఛత్తీస్‌గఢ్ -1800-233-2977-

గుజరాత్ 230-230-3160 –5500

హర్యానా – 1800–180–2087

హిమాచల్ ప్రదేశ్ – 1800–180–8026

జార్ఖండ్ – 1800–345–6598, 1800–212–5512

కర్ణాటక– 1800–425–9330–1

మధ్యప్రదేశ్ 1800–425–9330–5

మధ్యప్రదేశ్1800–425–9330

మధ్య ప్రదేశ్ 1800-22-4950

మణిపూర్- 1800-345-3821

మేఘాలయ- 1800-345-3670

మిజోరం- 1860-222-222-789, 1800-345-3891

నాగాలాండ్- 1830-34501800-34501800-34501 -345-6724 / 6760

పంజాబ్ - 1800-3006-1313

రాజస్థాన్ - 1800-180-6127

మీ రాష్ట్రం టోల్ ఫ్రీ నంబర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్‌లోని https://nfsa.gov.in/portal/State_UT_Toll_Free_AA లింక్‌ని సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే రేషన్‌ కార్డును ఆన్‌లైన్‌లో పొందవచ్చు. దీని కోసం మీ రాష్ట్రంలోని ఫుడ్ పోర్టల్ లేదా వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ అడిగిన సమాచారం అందించి ప్రక్రియను పూర్తి చేయాలి. తర్వాత మీ రేషన్ కార్డు జనరేట్ అవుతుంది.

Ration Card: మీకు కొత్తగా పెళ్లయిందా.. రేషన్‌కార్డుని ఇలా అప్‌డేట్‌ చేసుకోండి..!

Tags:    

Similar News