Indian Railways: రైల్వే ప్రయాణికులకి గమనిక.. టికెట్‌ బుకింగ్‌ సమయంలో ఆ సమాచారం అవసరం లేదు..!

Indian Railways: రైల్వే ప్రయాణికులకి గమనిక.. టికెట్‌ బుకింగ్‌ సమయంలో ఆ సమాచారం అవసరం లేదు..!

Update: 2022-04-15 12:30 GMT

Indian Railways: రైల్వే ప్రయాణికులకి గమనిక.. టికెట్‌ బుకింగ్‌ సమయంలో ఆ సమాచారం అవసరం లేదు..!

Indian Railways: మీరు తరచుగా రైల్వేలో ప్రయాణిస్తున్నట్లయితే ఈ వార్త మీ కోసమే ఉపయోగపడుతుంది. భారతీయ రైల్వే ఇప్పుడు టిక్కెట్ల బుకింగ్ నిబంధనలను మార్చింది. ఇప్పుడు మీరు మునుపటి కంటే తక్కువ సమయంలో టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. రైల్వే నిర్ణయం ప్రకారం.. ఇప్పుడు టికెట్ బుకింగ్ సమయంలో గమ్యస్థాన చిరునామా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే గతంలో కరోనా వల్ల IRCTC వెబ్‌సైట్, యాప్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారు గమ్యస్థాన చిరునామాను నమోదు చేయడం తప్పనిసరి చేశారు. ఇప్పుడు కోవిడ్-19 కేసులు తగ్గడంతో ఆ నిబంధన ఎత్తివేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

కోవిడ్ కేసులు పెరిగినప్పుడు పాజిటివ్ వ్యక్తిని గుర్తించడంలో గమ్యస్థాన చిరునామా సహాయం చేస్తుంది. కరోనా కాలంలో ఇన్ఫెక్షన్‌ను అధిగమించడానికి రైల్వే అనేక నియమాలను అమలు చేసిన సంగతి తెలిసిందే. అందులో ఇది ఒకటి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి పరిస్థితి సాధారణం కాగానే నిబంధనలను ఒక్కొక్కటిగా ఉపసంహరించుకుంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నియమాన్ని ఉపసంహరించుకోవడం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో ఇప్పుడు తక్కువ సమయం పడుతుంది. IRCTC ఆర్డర్ ప్రకారం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది.

కరోనా సమయంలో ఏసీ కోచ్‌లలో దిండు, దుప్పటి అందించేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రయాణికుల అవసరాల దృష్ట్యా వీటిని మళ్లీ ప్రారంభించింది. అలాగే టికెట్‌ కౌంటర్లని రీ ఓపెన్ చేశారు. రైళ్లలో ఇప్పుడు మెస్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అలాగే సీనియర్ సిటిజన్ల టికెట్లపై సబ్సిడీపై కూడా చర్చ జరుగుతోంది. దీనిపై కూడా ఓ నిర్ణయం వెలువడనుంది.

Tags:    

Similar News