ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రం క్లారిటీ
Telugu States: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రం క్లారిటీ
Telugu States: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు లేనట్టేనని స్పష్టం చేసింది. ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ నియోజకవర్గాల పెంపు కోసం 2026 జనాభా లెక్కల తర్వాత వరకు వేచి ఉండాలని వెల్లడించారు. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని స్పష్టం చేశారు నిత్యానందరాయ్. కిందటి ఏడాది ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ఇదే ప్రశ్నకు అడగ్గా.. ఇదే మంత్రి.. ఇదే సమాధానం ఇచ్చారు.