కరోనా థర్డ్ వేవ్ పై కేంద్రం సూచనలు.. పిల్లలకు మూడో ముప్పు అనుమానామే..?

Covid19 3rd Wave: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కాస్తంత తగ్గుముఖం పట్టింది.

Update: 2021-06-08 10:17 GMT

 Kids: (ఫైల్ ఇమేజ్ )

Covid 3rd Wave: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కాస్తంత తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్, మే నెలలో తీవ్ర స్థాయిలో ఉన్న కరోనా జూన్ మొదటి వారంలో లక్షకు దిగువన కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పటి వరకు మహమ్మారి చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే మూడోదశలో మాత్రం వారికి ముప్పు ఎక్కువగా ఉంటుందనే నిపుణుల అభిప్రాయాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దీనిపై తల్లిదండ్రులు, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకు తగ్గట్టుగా అప్రమత్తం అవుతున్నాయి. అయితే తదుపరి దశలో కరోనాతో పిల్లలకు ముప్పు పొంచి ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం వెల్లడించింది.

మూడో దశ పిల్లలపై ప్రత్యేకంగా ప్రభావం చూపుతుందనడంపై స్పష్టత లేదని కోవిడ్ నివారణ కమిటీ సభ్యులు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ఆధారంగా సీరో ప్రివలెన్స్ రేటు అదే విషయాన్ని వెల్లడి చేసిందన్నారు. అలాగే రానున్న దశలో వారికి అధికంగా ఈ వైరస్ సోకుతుందని రుజువు చేసే ఆధారాలు లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు. మరోపక్క కరోనా టీకాపై ఉన్న అనుమానాలను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చిన్నారులను రక్షించుకునేందుకు టీకా వేయించుకోవాలని తల్లిదండ్రులను కోరుతోంది.

పెద్దలు టీకాలు వేసుకుంటే పిల్లలకు వైరస్ సోకే అవకాశం చాలామటుకు తగ్గిపోతుందని తెలుస్తోంది. అలాగే పిల్లలపై మూడో ముప్పు ప్రభావానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేనందున తల్లిదండ్రులను ఆందోళన గురిచేయొద్దని ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ కోరింది. తదుపరి దశలో పసిపిల్లలో తీవ్ర లక్షణాలు ఉండొచ్చనే వాదనను నిపుణులు తోసిపుచ్చారు. రెండు దశల్లో భాగంగా సేకరించిన వివరాల ప్రకారం కొద్దిశాతం మందికి మాత్రమే తీవ్ర లక్షణాలు కనిపిస్తాయిని సూచిస్తున్నారు.

Tags:    

Similar News