శశికళ ముందస్తు విడుదల లేదు

నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయి కోర్టులో దోషులుగా తేలడంతో.. చెరో రూ.10 కోట్ల జరిమానా, నాలుగేళ్ల జైలుశిక్ష..

Update: 2020-09-23 02:36 GMT

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయి కోర్టులో దోషులుగా తేలడంతో.. చెరో రూ.10 కోట్ల జరిమానా, నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది న్యాయస్థానం.. ఈ తీర్పు ప్రకారం 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో వారు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వారికి నాలుగేళ్ల శిక్షాకాలం పూర్తవుతుంది. జనవరి లేదా ఫిబ్రవరి నాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే సత్ప్రవర్తన కింద ముందస్తుగానే ఈ ఏడాది ఆఖరులో చిన్నమ్మ విడుదలయ్యే అవకాశం ఉందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారం నేపథ్యంలో శశికళ విడుదలపై సమాచార హక్కు చట్టం కింద బెంగళూరు నగరానికి చెందిన టీ నరశింహమూర్తి అనే సామాజిక కార్యకర్త కర్ణాటక జైళ్లశాఖకు ఉత్తరం రాశారు. అందులో శశికళ ఎప్పుడు విడుదల అవుతారనే సమాధానం కావాలని కోరారు.. దానికి 2021 జనవరి 27వ తేదీ శశికళ విడుదలవుతారని జైళ్లశాఖ నరశింహమూర్తికి బదులిచ్చింది. అయితే ఆమె అనుచరులు మాత్రం ముందస్తుగానే విడుదల అవుతారని ఇంకా ఆసక్తితోనే ఉన్నారు. శశికళకు చెందాల్సిన సెలవు రోజులను పరిగణనలోకి తీసుకుని ఈ నెలాఖరులో లేదా వచ్చేనెలలో విడుదలవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2021 లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆమె మద్దతుదారులు పోటీకి తహతహలాడుతున్నారు.

Tags:    

Similar News