తమిళనాడును కుదిపేస్తున్న నివర్ తుఫాన్

నివర్ తుపాను తమిళనాడును కుదిపేస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తమిళనాడు తీర ప్రాంతం అతలాకుతలం అవుతోంది.

Update: 2020-11-24 14:44 GMT

Nivar Cyclone (file image)

నివర్ తుపాను తమిళనాడును కుదిపేస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తమిళనాడు తీర ప్రాంతం అతలాకుతలం అవుతోంది. అతి తీవ్ర తుపానుగా మారిన నివర్ రేపు కడలూర్లోని మామల్లాపురం దగ్గర తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పుదుచ్చేరిలో తుఫాను కారణంగా 144 సెక్షన్ విధించారు. కడలూరు, మహాబలిపురం, పెరలూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా 34 రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ మరో 13 రైళ్ల దారి మళ్లించింది. చెన్నైలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Tags:    

Similar News