బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు.. రేపు పట్నాలోని గాంధీ మైదానంలో సీఎం ప్రమాణస్వీకారం
బిహార్‌లో నితీష్‌కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.
బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు.. రేపు పట్నాలోని గాంధీ మైదానంలో సీఎం ప్రమాణస్వీకారం
బిహార్‌లో నితీష్‌కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రేపు పట్నాలోని గాంధీ మైదానంలో సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్పీకర్‌గా తమ పార్టీ వ్యక్తినే నియమించుకోవాలని బీజేపీ భావిస్తోందట. అలానే.. హోంశాఖ కోసం కూడా జేడీయూ, బీజేపీల మధ్య ఒప్పందం కుదరడం లేదట.
బిహార్ 18వ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 202 సీట్లు గెలుపొంది మహాగఠ్‌బంధన్ ఆశలపై నీళ్లు చల్లింది నితీష్ బృందం. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ అత్యధికంగా 89 సీట్లు గెలుపొందగా... జేడీయూ 85 సీట్లతో రెండోస్థానంలో ఉంది. ఈ 2 పార్టీల నేతలు స్పీకర్, హోం శాఖ పదవి తమ వాళ్లకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు.