విపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టడంపై.. అభ్యంతరం వ్యక్తం చేసిన నితిష్ కుమార్..
Opposition Meet: విపక్ష కూటమి భేటీలో పార్టీల మధ్య సమన్వయలోపం
విపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టడంపై.. అభ్యంతరం వ్యక్తం చేసిన నితిష్ కుమార్..
Opposition Meet: విపక్ష కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష కూటమి భేటీలో పార్టీల మధ్య సమన్వయలోపం బయటపడింది. నిన్న ప్రకటించిన ఇండియా కూటమికి నితీష్ కుమార్‌ను కన్వీనర్‌గా ప్రకటించకుండా మమతా బెనర్జీ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అయితే సమావేశం అనంతరం జరిగిన విపక్ష కూటమి మీడియా సమావేశంలో పాల్గొనకుండానే నితీష్ కుమార్ వెళ్లిపోయారు.
ఇక విపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టడంపై.. నితీష్ కుమార్, సీతారాం ఏచూరి సహా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన సమావేశంలో సోనియా గాంధీ, మమతా బెనర్జీ ఎక్కువగా కలిసి ఉండటంతో దీదీ... చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.