India Alliance: ఇండియా కూటమి కన్వీనర్‌గా బిహార్ సీఎం
India Alliance: నితీష్ కుమార్ పేరును బలపరుస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
India Alliance: ఇండియా కూటమి కన్వీనర్‌గా బిహార్ సీఎం
India Alliance: ఇండియా కూటమి కన్వీనర్‌గా బిహార్ సీఎం నితీష్ కుమార్ పేరు దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. వచ్చేవారం జరగనున్న ఇండియా కూటమి సమావేశంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ పేరును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బలపర్చనున్నారు. కూటమిపై జేడీయూ చీఫ్ అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాలతో వచ్చేవారం జరగనున్న సమావేశంలో నితీష్ కుమార్ పేరును కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రతిపాదించే అవకాశం ఉంది. జూమ్ మీటింగ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు కీలక నేతలు పాల్గోనున్నారు. కూటమి ప్రధాన పార్టీల జాతీయ అధ్యక్షులు కూడా ఈ వర్చువల్ మీట్‌లో పాల్గొంటారు.