Union Budget 2025: వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ సమర్పణతో నిర్మలా సీతారామన్ రికార్డ్
Union Budget 2025: నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు.
Union Budget 2025: వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్ సమర్పణతో నిర్మలా సీతారామన్ రికార్డ్
Union Budget 2025: నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. వరుసగా ఇలా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన చరిత్ర ఇప్పటివరకు లేదు 2019లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా నియమించారు. 2024లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ కేబినెట్ లో ఆమె మరోసారి ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ఫిబ్రవరి 1, 2025న ప్రవేశ పెట్టారు.
గతంలో మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్ లను ప్రవేశ పెట్టారు.1959 నుంచి 1964 వరకు ఆరు బడ్జెట్ లను ఆయన ప్రవేశ పెట్టారు. 1967 నుంచి 1969 వరకు మరో నాలుగు బడ్జెట్ లను ఆయన ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ నాయకులు పి. చిదంబరం, తొమ్మిది బడ్జెట్ లు ప్రవేశ పెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్ లు ప్రవేశ పెట్టారు.
2020లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ గా రికార్డుల్లోకెక్కింది.అప్పట్లో ఆమె రెండు గంటల 40 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు.అతి తక్కువ సమయం బడ్జెట్ స్పీచ్ గా 1977 లో నమోదైంది. హీరూబాయ్ ముఖర్జీ పాటిల్ 800 పదాలు మాత్రమే తన బడ్జెట్ ప్రసంగం ఉంది.
గతంలో సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది.బ్రిటీష్ ప్రభుత్వం నుంచి ఈ సంప్రదాయం కొనసాగింది. 1999లో వాజ్ పేయ్ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి చివరి తేదీ నుంచి ఫిబ్రవరి 1కి బడ్జెట్ సమర్పణ తేదీని 2017లో మార్చారు.