Nirbhaya Case : జైలు బయట స్వీట్లు పంచుకున్న ప్రజలు.. అంతకుముందు జరిగిందిదే..

నిర్భయ దోషులను ఈ రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు తీహార్ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

Update: 2020-03-20 02:49 GMT
Distributing sweets outside Tihar jail

నిర్భయ దోషులను ఈ రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు తీహార్ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు.ఆడకూతురిని వెంటాడి క్రూరాతి క్రూరంగా హింసించి చంపేసిన ఆ క్రూరమృగాళ్లను ఉరి తీయడం ద్వారా అటువంటి వారికి సరైన సందేశం ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. నలుగురు దోషులను ఉరి తీసే సమయంలో సాధారణ ప్రజలతో పాటు పెద్ద సంఖ్యలో మీడియా వ్యక్తులు కూడా తీహార్ జైలు వెలుపల వేచి ఉన్నారు. 'జడ్జిమెంట్ డే' పోస్టర్లతో అక్కడికి వచ్చిన ప్రజలు శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో తీహార్ జైలు వెలుపల పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను కూడా మోహరించారు.

ఈ రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు నిర్భయ కేసులో ఐదుగురు నిందితులను ఉరితీసినట్లు దయచేసి చెప్పండి.. అంటూ పోలీసులను అడుగుతూ జస్టిస్ నిర్భయ అంటూ నినాదాలు చేశారు. ఇంతలో నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీసినట్టు జైలు అధికారుల నుంచి వార్త రాగానే ప్రజలు తీహార్ జైలు వెలుపల స్వీట్లు పంచుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న భద్రతా దళాలకు కూడా స్వీట్లు పంచి పెట్టారు. అయితే నిన్న సాయంత్రం నలుగురు నిందితుల్లో ముగ్గురు తమ ఉరిశిక్షపై స్టే విధించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో జనాలకు మళ్ళీ అనుమానం మొదలైంది.

ఎప్పటిలాగే ఈసారి కూడా ఉరి వాయిదా పడుతుందా అని అనుకున్నారంతా.. అందరూ అనుకున్నట్టుగానే ఆ పిటిషన్ ను రాత్రి 9 గంటలకు మన్మోహన్ ధర్మాసనం కొట్టివేసింది. చివరికి వారి ఉరిశిక్షను సమర్థించింది. దీంతో తీహార్ జైలు అధికారులకు కీలక ఆదేశాలు అందాయి. అప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన జైలు అధికారులు.. నలుగుర్ని చివరి కోరిక అడిగి ఈ తెల్లవారుజామున వారిని ఉరి తీశారు. నిందితులను ఉరితీసిన తరువాత, నిర్భయ తల్లి మనసు కుదుటపడింది. కుమార్తె చిత్రాన్ని కౌగిలించుకుని చివరకు నీకు న్యాయం జరిగిందని ఆనందంతో చెప్పింది. 

Tags:    

Similar News