నిర్భయ దోషుల చివరి కోరికలు..

నలుగురు నిర్భయ దోషుల మృతదేహాలను దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ బిఎన్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్యానెల్ మృతదేహాలపై శవపరీక్షలు నిర్వహించనుంది.

Update: 2020-03-20 03:20 GMT
Nirbhaya case convicts

నలుగురు నిర్భయ దోషుల మృతదేహాలను దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ బిఎన్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్యానెల్ మృతదేహాలపై శవపరీక్షలు నిర్వహించనుంది. శవపరీక్షలు వీడియో తీయనున్నారు. మరోవైపు నలుగురు దోషులు ఎవ్వరూ కూడా ఈ ఉదయం ఉరి తీయడానికి ముందు చివరి కోరికలు వ్యక్తం చేయలేదని, తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ తెలిపారు. చివరి కోరికలు ఏంటని అడిగిన తరువాతే వారిని ఉరి తీసినట్టు చెప్పారు. ప్రోటోకాల్ ప్రకారం వారిని లాయర్ మరియు వైద్యుడి సమక్షంలోనే ఉరి తీసినట్టు చెప్పారు. కాగా ఉరి అనంతరం మృతదేహాలను 30 నిమిషాలపాటు ఉరికంబానికి అలాగే వేలాడదీశారు, వారు చనిపోయారని వైద్యుడు నిర్ధారించడంతో మృతదేహాలను ఉరికంబం నుంచి వేరుచేశారు.

ఇదిలావుంటే ఉరిశిక్ష సమయంలో తీహార్ జైలు వద్ద విధించిన తప్పనిసరి లాక్‌డౌన్ ను జైలు అధికారులు ఎత్తివేశారు. తిహార్ జైలులో భద్రతా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తమిళనాడు స్పెషల్ పోలీసులు, జైలు పరిసరాల్లో ఆర్డర్ లో ఉండేలా జెండాతో కవాతు నిర్వహిస్తున్నారు. కాగా ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు నిర్భయ దోషులను ఉరి తీస్తున్నారని తెలుసుకున్న సాధారణ ప్రజలు అక్కడికి చేరుకున్నారు. దాంతో ఒక గంట ముందు జైలు పరిసరాల్లో లాక్డౌన్ విధించారు.

Tags:    

Similar News