Nirbhaya Case: ఉరికి వేలాడిన మృగాళ్లు

Update: 2020-03-20 00:34 GMT

నిర్భయ తల్లి ఏడేళ్ల అసమాన పోరాటం ఫలించింది. తన కూతురిని క్రూరాతి క్రూరంగా చంపేసిన నలుగురు మృగాళ్లను ఇవాళ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరి తీశారు. మీరట్‌ నుంచి వచ్చిన తలారి పవన్‌ జలాద్‌ వారిని ఉరితీశారు. జైలు నెంబర్‌ 3లో అధికారుల సమక్షంలో ఉరిని అమలు చేశారు. ఉరి అనంతరం దోషులను పరీక్షించిన వైద్యులు వారు మృతి చెందినట్లు తేల్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలు డీడీయూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం 8 గంటలకు నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

దోషులకు ఉరి విధించడంపై నిర్భయ తల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులకైనా న్యాయం జరిగిందని ఇప్పుడు తన కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. ఇక ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ మాట్లాడుతూ ఇది చారిత్రాత్మక దినం, నిర్భయకు 7 సంవత్సరాల తరువాత న్యాయం జరిగింది, ఆమె ఆత్మకు ఈ రోజు శాంతి లభించి ఉండాలి. ఎవరైనా ఈ నేరానికి పాల్పడితే అతన్ని ఉరితీస్తారని దేశం దుర్మార్గులకు బలమైన సందేశం ఇచ్చింది. అని వ్యాఖ్యానించారు. నిర్భయ కేసులో నిందితులను ఉరితీసిన తరువాత నేడు ఒక ఉదాహరణను ఇచ్చామని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) అధ్యక్షుడు రేఖా శర్మ అన్నారు. ఇకపై అలాంటి వారికి శిక్ష పడుతుందని తెలుసు, తేదీ ముందుకు సాగవచ్చు, కాని శిక్ష నెరవేరుతుంది. అని ఆమె తెలిపారు.

 

 

Tags:    

Similar News