Breaking: నిర్భయ దోషులకు ఈనెల 20న ఉరిశిక్ష
నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్ జారీ అయింది. ఈనెల 20న నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలనీ ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్ జారీ అయింది. ఈనెల 20న నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలనీ ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 20వ తేదీ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు నలుగురు నిందితులను ఒకేసారి ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా డెత్ వారెంట్ జారీ చేశారు.
కాగా ఇప్పటికే మూడుసార్లు నిర్భయ దోషుల ఉరి వాయిదా పడింది. నిందితులు తమకున్న న్యాయవకాశాలను అన్నింటిని వినియోగించుకున్నారు. అయినప్పటికీ, దాని చట్టపరమైన అడ్డంకుల కారణంగా, మరణశిక్ష అమలు కాలేదు. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు నాలుగోసారి డెత్ వారెంట్ జారీ చేసింది.