Nirbhaya Case: నిర్భయ నిందితులకు రేపు ఉరి.. నా కొడుక్కి అవి తినిపించాలని ఉంది: వినయ్ శర్మ తల్లి

రేపు నిర్భయ నిందితులను ఉరితీసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జైలు అధికారులు.

Update: 2020-03-19 11:45 GMT
Nirbhaya Convict Vinay Sharma (File Photo)

రేపు నిర్భయ నిందితులను ఉరితీసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జైలు అధికారులు. నలుగురు దోషులకు ఎటువంటి న్యాయపరమైన అవకాశాలు లేవని కోర్టు చెప్పడంతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. నలుగురు దోషుల ఉరిశిక్షలను నిలిపివేయాలని కోరిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం తిరస్కరించింది. దీంతో వారికి మరణశిక్ష ఖాయమైపోయింది. నిందితులను ఉరితీసేందుకు గాను తలారి తీహార్ జైలుకు చేరుకున్నారు. సరిగ్గా ఉదయం 5 గంటల 30 నిమిషాలకు నలుగురిని ఒకేసారి ఉరి తీయనున్నారు. కాగా ఇప్పటికే మూడు సార్లు వీరి ఉరి వాయిదా పడింది.

దాంతో ఈసారైనా అమలవుతుందా అనే సందేహాల నడుమ కోర్టు కూడా ఉరి అమలు చేయవచ్చని చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే కోర్టులో నిందితులు వేసిన ప్రతి పిటిషన్ ను కొట్టివేయడంతో, నిర్భయ దోషుల నిరీక్షణ రేపు అంతం కాబోతోంది. ఇప్పుడు దోషుల బంధువులు , కుమారులను రక్షించాలనే ఆశ ఉన్న తల్లిదండ్రులు రోదించడం తప్ప చేసేదేమి లేదు. నలుగురు దోషులలో ఒకరైన వినయ్ శర్మ తల్లి తన కొడుకుకు చివరిసారిగా పూరి, సబ్జి తినిపించాలని కోరుకుంటున్నట్టు తెలిసింది. అయితే అధికారులు దీనికి అనుమతి ఇస్తారో లేదో తెలియాలి.


Tags:    

Similar News