FASTag KYC: ఫాస్టాగ్‌‌ యూజర్లకు KYC తప్పనిసరి.. కీలక ప్రకటన చేసిన NHAI

FASTag KYC: లేదంటే డీ యాక్టివేట్ అవుతాయని ప్రకటించిన NHAI

Update: 2024-01-15 13:45 GMT

FASTag KYC: ఫాస్టాగ్‌‌ యూజర్లకు KYC తప్పనిసరి.. కీలక ప్రకటన చేసిన NHAI 

FASTag KYC: మీ ఫాస్టాగ్‌కు KYC ఉందా..? లేదంటే వెంటనే చేయించుకోండి.. జనవరి 31 లోపు KYC పూర్తి చేయకపోతే మీ అకౌంట్ డీయాక్టివ్ అవడం ఖాయమని చెబుతోంది నేషనల్ హైవేస్ అథారిటీ. ఫాస్టాగ్‌ల ద్వారా టోల్‌ వసూళ్లను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది. KYC పూర్తిచేయని ఫాస్టాగ్‌లను నిలుపుదల చేసేందుకు సిద్ధమైంది. జనవరి 31 తర్వాత KYC చేయని ఫాస్టాగ్ అకౌంట్లను బ్యాంకులు డీయాక్టివేట్‌ లేదా బ్లాక్‌ చేస్తాయని ప్రకటించింది నేషనల్ హైవేస్ అథారిటీ. యూజర్లు కేవైసీలు పూర్తిచేసేందుకు.. టోల్‌ప్లాజాలు లేదా సంబంధిత బ్యాంకు కస్టమర్‌కేర్‌ నంబర్‌లను సంప్రదించాలని సూచించింది. ఇక వాహనదారులు ఒకే ఫాస్టాగ్‌ను అనేక వాహనాలకు ఉపయోగించడం, ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్‌లను లింక్‌ చేస్తున్నట్లు దృష్టికి రావడంతో.. వన్ వెహికిల్, వన్ ఫాస్టాగ్‌ విధానానికి నేషనల్ హైవేస్ అథారిటీ చర్యలు చేపట్టింది.

Tags:    

Similar News