NGT Clarifications For Environmental Permits : ఆ ప్రాజెక్ట్ లకి పర్యావరణ అనుమతులు తప్పనిసరి .. ఎన్జీటీ స్పష్టీకరణ

NGT Clarifications For Environmental Permits : పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి పర్యావరణ అనుమతులు

Update: 2020-09-09 08:47 GMT

Pattissima Project (File Photo)

NGT Clarifications For Environmental Permits : పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి పర్యావరణ అనుమతులు తప్పనిసరి అంటూ డిల్లీలోని ఎన్.జి.టి ప్రధాన ధర్మాసనం వెల్లడించింది. జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్, జస్టిస్ వాంగ్డీ, డాక్టర్ నగీన్ నంద లతో కూడిన ధర్మసనం ఈ నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టులో ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అంతర్భాగం కాదని చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ, నిపుణల కమిటీ నివేదికతో ఏకీభవించిన ధర్మాసనం.. పట్టిసీమ, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వహణలో ఉన్నాయి కాబట్టి, వాటిని ఆపకుండా సత్వరమే పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది..

పురుషోత్త పట్నం ప్రాజెక్టు ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా నిర్వహించద్దని ఆదేశించింది.. ఇక పర్యావరణ అనుమతులు లేకుండా నిర్వహించినందుకు గాను పరిహారం, జరిమానా అంచనా వేసేందుకు కమిటిని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, కేంద్ర మరియు ఏపి రాష్ట్ర కాలుష్య నివారణ మండలితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఆరు నెలల్లో రాష్ట్రం నుంచి పరిహారాన్ని వసూలు చేయాలని ఆ కమిటీని ఆదేశించింది ధర్మసనం. గోదావరి, పెన్నా నదులపై ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌, త్రినాథ్‌రెడ్డి ఎన్జీటీలో గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags:    

Similar News