New System to Use EVMs: ఈవీఎంలు నొక్కేందుకు 'పుల్లలు'...ఎన్నికల సంఘం ఆలోచన!

New System to Use EVMs: కరోనా నేపథ్యంలో ఇప్పటికే అరవై ఏళ్ల వయస్సు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని నిర్ణయం

Update: 2020-07-05 03:29 GMT

New System to Use EVMs: కరోనా నేపథ్యంలో ఇప్పటికే అరవై ఏళ్ల వయస్సు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈవీఎం లపై చేతి వేళ్లతో నొక్కే విధానాన్ని మార్పు చేయాలని యోచిస్తున్నారు. గతంలో మాదిరి వేళ్లతో నొక్కితే ఒకరి నుంచి మరొకరికి, అలా మొత్తానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఈ విధానాన్ని అమలు చేసేందుకు యోచిస్తున్నారు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ప్రభుత్వం ముందు ఉంచి అమలు చేసేందుకు నిర్ణయించారు.

బీహారులో వచ్చే అక్టోబర్ ,నవంబర్ ఎన్నికలలలో కరోనా వైరస్ నేపద్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై ఎన్నికల సంఘం అదికారులు కసరత్తు చేస్తున్నారు.వారు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయని అంటున్న అదికారులు ,కరోనా పరిస్థితులను ఎదుర్కోవడానికి వీలుగా కొన్ని కొత్త ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవిఎమ్ లపై వేలు పెట్టి నొక్కకుండా, ప్రతి ఓటర్ కు ఒక చిన్న స్టిక్ (పుల్ల) ఇస్తారు. దానిని వారు వాడవలసి ఉంటుంది.అలాగే ఎక్కువ మంది క్యూలో ఉండకుండా జాగ్రత్తపడతారు. ఎవరైనా మాస్క్ లేకుండా వస్తేవారికి ఎన్నికల సంఘం ఉచితంగా మాస్క్ ఇస్తుంది.అలాగే పోలింగ్ బూత్ వద్ద శానిజైటర్ పెట్టి ప్రతి ఒక్కరు వాడేలా చూస్తారు.మరో వైపు అరవైఐదేళ్లు దాటినవారికి పోస్టల్ బాలెట్ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నందున ,బాలెట్ పత్రాల వినియోగం పెరుగుతుందని అదికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద కరోనా ఎఫెక్ట్ తో ఎన్నికల సరళి మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News