NEET-PG 2025: కేరళలో NEET-PG కోసం అదనపు సెంటర్స్ కోరిన శశి థరూర్

NEET-PG 2025: అభ్యర్ధుల ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రికి వెల్లడి

Update: 2025-06-14 09:01 GMT

NEET-PG 2025: కేరళలో NEET-PG కోసం అదనపు సెంటర్స్ కోరిన శశి థరూర్

NEET-PG 2025: కేరళలోని తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు శశి ధరూర్ శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డాకు లేఖ రాశారు. కోస్టల్ ఏరియాలో NEET-PG అభ్యర్ధులకు అదనపు కేంద్రాలను తక్షణమే మంజూరు చేయాలని కోరారు.

వెబ్ సైట్ తిరిగి తెరిచిన నిమిషాల్లోనే అందుబాటులో ఉన్న సీట్లు అన్నీ అయిపోయాయి. దీనివల్ల విద్యార్ధులు కేరళలోని ఏ నగరాన్ని ఎంచుకోలేకపోయారు.

కేరళలో ధరఖాస్తుదారుల సంఖ్యపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఇప్పటికే డేటాను కలిగి ఉందని తన లేఖలో శశిథరూర్ హైలేట్ చేశారు. అలాగే రాష్ట్రంలో కేంద్రాల సంఖ్యను పరిమితం చేయడం అదేవిధంగా అభ్యర్ధులను పరీక్ష కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లమని బలవంతం చేస్తే విద్యార్దులు చాలా ఇబ్బందులకు గురవుతారు. వారిపైన ఆర్ధికభారం ఎక్కువగా పడుతుంది..అని థరూర్ అన్నారు. అలాగే ఇది న్యాయబద్దమైంది కాదని అభ్యర్ధుల సౌకర్యం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని జెపీ నడ్డాను కోరారు.

ఇదిలా ఉంటే NEET-PG 25 పరీక్ష ఆగష్టు 3న జరగనుంది. దీంతో (NBEMS) దేశవ్యాప్తంగా దాదాపు 233 సెంటర్స్‌ని ప్రకటించింది. అభ్యర్ధులు తమకు సౌకర్యంగా ఉండే సెంటర్స్‌ను ఎంచుకునేందుకు జూన్ 13వరకు జూన్ 17వరకు గడువు ఇచ్చింది. ఈ సమయంలో అభ్యర్ధులు అధికారిక పోర్టల్ ద్వారా వాటిని సమర్పించాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఆధారంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ వల్ల కేరళ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ ధరఖాస్తుదారులు ఉన్న ప్రాంతంలో సీట్లు కొరత ఏర్పడుతుంది. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శిశి థరూర్ కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి నడ్డాకు లేఖ రాశారు.

Tags:    

Similar News