ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూకు జడ్ ప్లస్ సెక్యూరిటీ
Draupadi Murmu: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూకు కేంద్రం జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూకు జడ్ ప్లస్ సెక్యూరిటీ
Draupadi Murmu: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూకు కేంద్రం జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదికి నేటి నుంచి సీఆర్పీఎఫ్ దళాలు భదత్ర ఇవ్వనున్నాయి. జడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్ ప్రకారం సీఆర్‌పీఎఫ్ కమాండోలతో రక్షణ ఏర్పాటు చేశారు. దేశంలోనే జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అంటే అత్యంత కీలకమైనది. అభ్యర్థిగా ఎంపిక కాగానే ముర్ము.. రాయ్‌రంగపూర్ లోని జగన్నాథ్ ఆలయం, శివాలయం వంటి ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆమెను అతి దగ్గరగా చూసిన ప్రజలు ఇప్పటివరకు తమ మధ్య సాదాసీదాగా తిరిగిన వ్యక్తి ఇకపై రాష్ట్రపతి భవన్ కు వెళ్తారంటున్నారు. అలాగే తమ గిరిజన జాతికి ఇకపై అత్యున్నత గౌరవం దక్కుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.