భారత్‌కు చేరుకున్న నమీబియా చీతాలు.. స్పెషల్ ఫ్లైట్‌లో భారత్‌కు వచ్చిన 8 చీతాలు

Cheetahs: అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే దిశగా అడుగులు

Update: 2022-09-17 02:59 GMT

భారత్‌కు చేరుకున్న నమీబియా చీతాలు.. స్పెషల్ ఫ్లైట్‌లో భారత్‌కు వచ్చిన 8 చీతాలు

Cheetahs: ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత నమీబియా చీతాల మెరుపు కదలికల్ని చూడబోతున్నాం. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకువచ్చారు. ప్రధాని మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో– పాల్‌పూర్‌ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి చీతాలను విడుదల చేస్తారు. రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చీతాలను తీసుకువచ్చారు. వీటిని తీసుకురావడానికి బీ747 జంబో జెట్‌కు మార్పులు చేశారు. దీని ముందు భాగంలో చీతా బొమ్మను పెయింట్‌ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

కునో నేషనల్ పార్క్.. గ్వాలియర్‌కు 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాజ్‌పుర ఎయిర్‌ బేస్‌ను IAF పర్యవేక్షిస్తోంది. ఇక ప్రధాని మోడీ కాసేపట్లో కునో నేషనల్ పార్క్‌లో చీతా ప్రాజెక్టును ప్రారంభిస్తారు. మూడు చీతాలను క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్లలోకి విడుదల చేస్తారు. ఇవాళ ప్రధాని మోదీ పుట్టిన రోజు కూడా కావడం విశేషం.

Tags:    

Similar News