ముస్లిం ప్రబోధకుడు అద్నన్ అక్తర్‌కు 1075 ఏళ్ల జైలు శిక్ష

వివాదాస్పద ముస్లిం ప్రబోధకుడు అద్నన్‌ అక్తర్‌కు టర్కీ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది.

Update: 2021-01-13 02:13 GMT

Adnan Akhtar (file image)

వివాదాస్పద ముస్లిం ప్రబోధకుడు అద్నన్‌ అక్తర్‌కు టర్కీ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్లపై లైంగిక దాడులు, ఆర్మీ గూఢచర్యం, బ్లాక్‌మెయిలింగ్‌ లాంటి కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు అతనికి వెయ్యి 75 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఓ ప్రైవేటు టీవీ చానెల్‌ ద్వారా మతపరమైన బోధనలు చేస్తూ పాపులర్‌ అయిన అద్నన్‌ అక్తర్‌ మహిళల నడుమ కూర్చుని విలాసంగా కూర్చుని చర్చలు నిర్వహించేవాడు. ఈ క్రమంలో అతడి కార్యకలాపాలపై నిఘా పెట్టిన టర్కీ మీడియా వాచ్‌డాగ్‌ అతడి చానెల్‌పై నిషేధం విధించింది.

 అటు స్థానిక పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు అద్నన్‌ నివాసాలపై దాడులు చేసి, 2018లో అతడిని అరెస్టు చేశారు. అతడితో పాటు పదుల సంఖ్యలో అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మైనర్లకు లైంగిక వేధింపులు, అత్యాచారం, గూఢచర్యం లాంటి 10 ప్రధాన కేసుల్లో అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. అతడి ఫాలోవర్లలో 13 మందికి కఠిన కారాగార శిక్షలు విధించింది.

ప్రతీ ఈవెంట్‌లో పాల్గొనడానికి చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. పది నిమిషాల పాటు పారా మోటరింగ్ చేయడానికి 15 వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్‌కు 5 వందల రూపాయలుగా నిర్ధారించారు. 

Tags:    

Similar News