Most Wanted Criminal Arrested: వేషం మార్చి అజ్ఞాతంలోకి.. ముంబాయిలో ఘ‌రానా మోస‌గాని అరెస్టు

Most Wanted Criminal Arrested; ప్రముఖుల హత్యలతో సహా 51 కేసుల్లో ప్రధాన నిందితుడైన ఓ గ్యాంగ్‌స్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ‌ ముంబాయికి వ‌చ్చి వేషం మార్చి పండ్ల విక్రేతగా అవతారమెత్తాడు.

Update: 2020-09-06 15:59 GMT

 most wanted criminal 

Most Wanted Criminal Arrested: ప్రముఖుల హత్యలతో సహా 51 కేసుల్లో ప్రధాన నిందితుడైన ఓ గ్యాంగ్‌స్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ‌ ముంబాయికి వ‌చ్చి వేషం మార్చి పండ్ల విక్రేతగా అవతారమెత్తాడు. అయినా స‌రే యూపీ పోలీసులు అతడ్ని వదల్లేదు. ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లా.. అత‌ని ఫోన్ కాల్స్ ఆధారంగా ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో శనివారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆషు జాత్‌(32) హత్యలు, కిడ్నాప్‌లు, దోపిడీలు వంటి 51 కేసుల్లో ప్రధాన నిందితుడు. ఆషు జాట్ గ్యాంగ్ లో 25 మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్యాంగ్ ను 'మిర్చి గ్యాంగ్' అని పిలుస్తారు. కళ్లల్లో కారం కొట్టి దోపిడీలకు పాల్పడుతుండడంతో ఆ పేరొచ్చింది. నోయిడాకు చెందిన ప్రముఖులు గౌరవ్‌, హపుర్‌, బీజేపీ నాయకుడు రాకేశ్‌ శర్మలను హత్య చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అతడిపై రూ.2.5 లక్షల రివార్డు కూడా ప్ర‌క‌టించారు.

యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారన్న భయంతో ఆషు జాట్ ముంబయి పారిపోయాడు. అక్కడ వేషం మార్చుకుని, పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ముంబయిలో ఉన్న విషయం పసిగట్టిన పోలీసులు వేటకు సిద్ధమయ్యారు. కానీ, ఆషు వేషంలో మార్పు కారణంగా అతడ్ని కనుక్కోవటం కష్టంగా మారింది. వేషం మార్చినా అతడు పాత స్నేహితులతో సంబంధాలు తెంచుకోలేదు. ఓ రోజు యూపీలోని అతడి సహచరుడికి ఫోన్‌ చేయటంతో ట్రాక్‌ చేసిన పోలీసులు శనివారం ఆషుని అరెస్ట్‌ చేశారు. 

Tags:    

Similar News