Mumbai Monorail: హఠాత్తుగా ఆగిపోయిన మోనో రైలు.. ప్రయాణికులు సేఫ్
Mumbai Monorail: ముంబైలో మోనోరైల్లు మరోసారి సాంకేతిక లోపంతో నిలిచిపోయాయి.
Mumbai Monorail: హఠాత్తుగా ఆగిపోయిన మోనో రైలు.. ప్రయాణికులు సేఫ్
Mumbai Monorail: ముంబైలో మోనోరైల్లు మరోసారి సాంకేతిక లోపంతో నిలిచిపోయాయి. వాడాలా వైపు వెళ్తున్న ఒక రైలు ఆంటోఫిల్ బస్ డిపో, జీటీబీ నగర్ స్టేషన్ల మధ్య ఉన్నట్టుండి ఆగిపోయింది. ఉదయం 7 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోగా.. రైల్లో విద్యుత్ లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు. సుమారు 45 నిమిషాల తర్వాత అధికారులు స్పందించి.. 17 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు.
ముంబైలో మోనోరైల్ సేవలు 2014 నుంచి కొనసాగుతున్నాయి. ఈ రైలు ముంబైలోని వడాలా నుండి చెంబూర్, సంత్ గాడ్గే మహారాజ్ చౌక్ వరకు దాదాపు 20 కిలోమీటర్ల మార్గంలో నడుస్తోంది. అయితే, ఇటీవలే కాలంలో ఈ రైలు సేవల్లో అంతరాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.